Advertisement

కార్యకర్తలతో భేటీకి పిలుపు.. సురేఖకు కొత్త పోస్ట్?

వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. శనివారం సాయంత్రం హనుమకొండలోని రాంనగర్ నివాసానికి చేరుకున్న కొండా దంపతులు, ఆదివారం ఉదయం 10 గంటలకు ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక సమస్యలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించి, కేడర్‌కు దిశా నిర్దేశం చేయనున్నారు.

ఈ సమావేశం ముగిసిన వెంటనే కొండా సురేఖ ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలతో భేటీ అయి తెలంగాణ రాజకీయాలు, వరంగల్ ప్రాంతంలో పార్టీ బలోపేతంపై చర్చించే అవకాశముంది. ఇటీవల టీపీసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌తో భేటీ అనంతరం సురేఖకు రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు దక్కవచ్చనే ప్రచారం జోరందుకుంది. ఢిల్లీ పర్యటన తర్వాతే ఈ వ్యవహారంపై స్పష్టత రానుంది.

Advertisement
Advertisement