Advertisement

విజయనగరం వైసీపీలో పెను మార్పులు

విజయనగరం జిల్లా వైఎస్సార్‌సీపీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ను నియమిస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వైకాపా కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనా విడుదల చేసింది.

ఇప్పటివరకు జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను (మజ్జి శ్రీనివాసరావు) ఇటీవల వైఎస్సార్‌సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో ఆ పదవి ఖాళీ అయింది. పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణను దృష్టిలో ఉంచుకుని అనుభవజ్ఞుడైన బెల్లానకు అధిష్టానం ఈ బాధ్యతలను అప్పగించింది.

Advertisement

మరోవైపు నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త మార్పు కూడా జరిగింది. ఇప్పటివరకు ఇక్కడ ఇంఛార్జిగా ఉన్న అప్పలనాయుడిని తప్పించి, ఆయన స్థానంలో గదల సన్యాసినాయుడిని నియమించారు. త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, రాజకీయ పోరాటాలకు క్యాడర్‌ను సిద్ధం చేసేందుకే ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

Advertisement