Advertisement

‘స్పిరిట్’పై నిర్మాత ప్రణయ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

TG CINEMA: రివ్యూలతో సినిమాల స్థాయిని ఎప్పటికీ తగ్గించలేరని నిర్మాత ప్రణయ్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన నిర్మించిన ‘రోమాంచకం’ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న నేపథ్యంలో.. కొందరు కావాలనే విమర్శలు చేశారని ఆయన మండిపడ్డారు. ఒక ప్రాజెక్ట్‌ను తెరపైకి తీసుకురావడం వెనుక ఎంతో మంది శ్రమ ఉంటుందని, రివ్యూల పేరుతో కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లు వ్యవహరించడం సరికాదన్నారు.

తాను నిర్మిస్తోన్న భారీ అప్‌కమింగ్ చిత్రం ‘స్పిరిట్’ గురించి ప్రస్తావిస్తూ.. వారికి నిజంగా అంత సామర్థ్యం ఉంటే రాబోయే ‘స్పిరిట్’ స్థాయిని తగ్గించగలరా? అంటూ సవాల్ విసిరారు. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హైఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం వచ్చే ఏడాది మార్చి 5న విడుదల కానుంది. మొదట ఈ ప్రాజెక్ట్‌లో దీపికను అనుకున్నప్పటికీ, ఆ తర్వాత త్రిప్తి దిమ్రీని ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement