Advertisement

బిగ్‌బాస్ ఎంట్రీపై సుప్రీతా క్లారిటీ.. తల్లి ఇష్టమే నాకెక్కువ

TG: టాలీవుడ్ నటి సురేఖావాణి కూతురు సుప్రీతా బిగ్‌బాస్ పదో సీజన్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నట్లు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై తాజాగా సుప్రీతా స్పందించి స్పష్టతనిచ్చారు. తనకు బిగ్‌బాస్ నుంచి ఆఫర్ వచ్చినప్పటికీ, తల్లి సురేఖా వాణికి ఉన్న ఆందోళనల కారణంగా తాను ఈ షోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు ఆమె వెల్లడించారు.

హౌస్‌లో భావోద్వేగాలను తాను కంట్రోల్ చేసుకోగలనా లేదా అనే సందేహాలు తన తల్లికి ఉన్నాయని, ఆమెకు ఇష్టం లేనప్పుడు తాను ఆ షోకి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ముందుగా వచ్చిన సాధారణ ఎంట్రీ అవకాశాన్నే తల్లి కోసం వదులుకున్నానని, ఇప్పుడు వైల్డ్ కార్డ్ ద్వారా వెళ్లే వార్తల్లో నిజం లేదని తేల్చిచెప్పారు. తాను షోకి వెళ్లకపోయినా బిగ్‌బాస్‌కు వీరాభిమానినని, బయట నుంచి ఒక సాధారణ ప్రేక్షకురాలిగా ప్రతి ఎపిసోడ్‌ను ఆస్వాదిస్తున్నానని తెలిపారు. సుప్రీతా ప్రకటనతో వస్తున్న పుకార్లకు చెక్ పడినట్లయింది.

Advertisement
Advertisement