Advertisement

విజయనగరం: మరోసారి కంటతడి పెట్టుకున్న ఎమ్మెల్సీ బొత్స

AP: వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మరోసారి బహిరంగంగా భావోద్వేగానికి గురయ్యారు. విజయనగరం జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతుండగా ఆయన వెక్కివెక్కి ఏడ్చారు. ఇటీవల ఆయన మేనల్లుడు చిన్న శ్రీను టీడీపీలో చేరిన పరిణామాల నేపథ్యంలోనే ఆయన తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయగా.. సమావేశంలో ఈ భావోద్వేగ ఘటన చోటుచేసుకుంది. నిన్న సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలోనూ మేనల్లుడి ప్రస్తావన రాగానే ఆయన కంటతడి పెట్టుకోవడం గమనార్హం.

Advertisement