Advertisement

కొండా సురేఖకు మీనాక్షి నటరాజన్ ఫోన్

TG POLITICS: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, మాజీ మంత్రి కొండా సురేఖకు ఫోన్ చేసి మాట్లాడారు. రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై ఆరా తీసిన ఆమె, అంతర్గత విభేదాలు పక్కనపెట్టి పార్టీ కార్యక్రమాల్లో తిరిగి క్రియాశీలకంగా మారాలని సూచించారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ కొండా సురేఖ గైర్హాజరు కావడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ తరుణంలో ఇన్‌ఛార్జి నేరుగా ఫోన్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అధిష్టానం నుంచి స్పష్టమైన సూచనలు రావడంతో రేపటి నుంచి ఆమె అసెంబ్లీకి హాజరవుతారా లేదా అనేదానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా, ఇటీవలే సీఎం రేవంత్‌ రెడ్డి సిఫార్సు మేరకు మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్‌ అయిన విషయం తెలిసిందే.

Advertisement