Advertisement

నేడు విజయనగరం జిల్లాలోని పాఠశాలలకు సెలవు

విజయనగరం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో శనివారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యం నాయుడు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ విషయాన్ని వెంటనే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తెలియజేయాలని డీఈఓ సూచించారు. వర్షాల కారణంగా నేడు నిర్వహించాల్సి ఉన్న కాంపెన్సేటరీ పని దినాన్ని కూడా వాయిదా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement