Advertisement

నటీ సమంతకు సర్ నోటీసులు

హైదరాబాద్: ఓటరు సమగ్ర ఇంటింటి సర్వే ప్రక్రియలో భాగంగా ప్రముఖ సినీ నటి సమంతకు నోటీసు అందించినట్లు శేరిలింగంపల్లి సర్కిల్‌ అధికారులు వెల్లడించారు. నానక్‌రాంగూడలోని ఆమె నివాసంలో గత నెలలోనే సమంత తల్లికి ఈ నోటీసు అందజేసినట్లు తెలిపారు. గత నెల 31న నిర్వహించిన హియరింగ్‌కు సమంత వ్యక్తిగతంగా హాజరు కాలేదని, ఆమె ప్రతినిధులు కూడా ఎలాంటి ధ్రువపత్రాలు తీసుకోరాలేదని శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్, నియోజకవర్గం ఓటరు జాబితా బాధ్యుడు నారాయణ అమిత్‌ మాలెంపాటి స్పష్టం చేశారు. అయితే, అవసరమైన పత్రాలు సమర్పించడానికి ఇంకా గడువు ఉందని ఆయన పేర్కొన్నారు. సమంత లేదా ఆమె తరఫున ప్రతినిధులు వచ్చి సంబంధిత ధ్రువీకరణ పత్రాలు అందజేస్తే సరిపోతుందని కమిషనర్ వివరించారు.

Advertisement