TG CRIME: అద్దె చెల్లించలేదనే నెపంతో ఇంటి యజమాని అవమానించడంతో మనస్తాపం చెందిన దంపతులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన హనుమకొండలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తెలంగాణ ఉద్యమ సమయంలో వందలాది మంది ఉద్యమకారులకు, విద్యార్థులకు ఉచితంగా భోజనం పెట్టిన హోటల్ యజమానులు కేదారి, పుష్పలత దంపతులు కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ క్రమంలో సమయానికి అద్దె చెల్లించలేదని హోటల్ యజమాని కుమారుడు రాము షట్టర్‌కు తాళం వేశాడు. పుష్పలతను తీవ్ర పదజాలంతో దూషించాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల అద్దె ఆలస్యమైందని, కొంత సమయం ఇవ్వాలని దంపతులు ఎంత వేడుకున్నా రాము వినలేదు.
అందరి ముందూ జరిగిన అవమానాన్ని భరించలేక కేదారి, పుష్పలత దంపతులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఈ ప్రమాదంలో కేదారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన పుష్పలత ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. మృతుల కుమారుడు పృథ్వీ ఫిర్యాదు మేరకు యజమాని, ఆయన కుమారుడు రాముపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Lavanya is a content writer at Mana Patrika, covering useful updates and information for Telugu readers. She writes about education, jobs, current affairs, technology, entertainment, and other topics that are relevant to everyday readers. Her focus is on presenting information in a clear, simple, and easy-to-understand way.
