Advertisement

నేడు దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్

వివిధ డిమాండ్ల సాధనకై బ్యాంకు ఉద్యోగుల సంఘాల పిలుపు మేరకు శుక్రవారం దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి. 5 రోజుల పనిదినాల విధానాన్ని అమలు చేయాలని, పెన్షన్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఈ బంద్‌కు పిలుపునిచ్చింది.ఈ బంద్ ప్రభావంతో పాటు శనివారం రెండో శనివారం, ఆదివారం సాధారణ సెలవు కావడం, సోమవారం వినాయక చవితి పండుగ ఉండటంతో వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఆర్థిక లావాదేవీలు, చెక్కుల క్లియరెన్స్ నిలిచిపోయే అవకాశం ఉన్నందున ఖాతాదారులు డిజిటల్ సేవలను ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.

Advertisement