Advertisement

BREAKING: కొవ్వూరులో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలో శుక్రవారం గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విజయవాడ వైపు వెళ్లే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రమాదం కారణంగా తునిలో అలంక ఎక్స్‌ప్రెస్‌, అన్నవరంలో ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌, సామర్లకోటలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌, అనకాపల్లిలో సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement