Advertisement

పంచాయతీ నిధులు ఇక బ్యాంకు ఖాతాల్లోనే: మంత్రి సీతక్క

గ్రామ పంచాయతీలకు వచ్చే ఆదాయాన్ని ట్రెజరీలో కాకుండా నేరుగా వాటి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసుకునే సదుపాయాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. ఇందుకు సంబంధించిన పంచాయతీరాజ్ చట్టం-2018 సవరణ బిల్లును గురువారం అసెంబ్లీ ఆమోదించింది. ఇకపై గ్రామసభ తీర్మానంతో నేరుగా ఈ నిధులను పంచాయతీల అభివృద్ధికే వాడుకోవచ్చని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఇప్పటివరకు నిధులను ట్రెజరీలో జమ చేయడం వల్ల వాటిని డ్రా చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ కొత్త విధానంతో పంచాయతీల ఆదాయం పూర్తిస్థాయిలో గ్రామాల పురోగతికే ఉపయోగపడుతుందని ఆమె స్పష్టం చేశారు.

Advertisement