Advertisement

ఖమ్మం గురుకులంలో దారుణం.. విద్యార్థి మృతి

TG: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం బీసీ గురుకుల పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. ఆటలాడుతూ 8వ తరగతి విద్యార్థి ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామానికి చెందిన హరీష్, ప్రియాంక దంపతుల కుమారుడు సలిగంటి సాత్విక్‌ (14) రఘునాథపాలెం గురుకులంలో చదువుతున్నాడు. బుధవారం ఉదయం 5 గంటలకు లేచి తోటి విద్యార్థులతో కలిసి పాఠశాల ప్రాంగణంలో రన్నింగ్ చేశాడు.

పరుగు పూర్తి చేసి వచ్చిన సాత్విక్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని వ్యాయామ ఉపాధ్యాయుడు తెలిపారు. వెంటనే అతనికి సపర్యలు చేసి ఖమ్మం సర్వజనాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బాలుడు గుండెపోటుతో మృతి చెంది ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కాగా, సాత్విక్ మృతికి వేరే ఏమైనా కారణాలు ఉన్నాయేమోనని బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటనతో గురుకులంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Advertisement
Advertisement