Advertisement

ఘట్‌కేసర్‌: గణేశ్ విగ్రహ తరలింపులో డ్రైవర్‌ మృతి

TG CRIME: వినాయక విగ్రహం తరలింపులో నిర్వాహకుడి నిర్లక్ష్యం ఓ ఆటో ట్రాలీ డ్రైవర్ ప్రాణాలను బలిగొంది. ఎస్సై ఎ.శేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్‌కేసర్‌ మండలం ఘనపూర్‌ నుంచి అల్వాల్‌కు భారీ గణేశుడి విగ్రహాన్ని తరలించేందుకు నిర్వాహకుడు శరత్‌యాదవ్‌ ఓ ఆటో ట్రాలీని ఏర్పాటు చేశాడు. సోమవారం విగ్రహాన్ని తరలిస్తుండగా వేలాడుతున్న 11 కేవీ విద్యుత్తు తీగల వల్ల ప్రమాదం ఉందని డ్రైవర్‌ భానుప్రసాద్‌(28) చెప్పినా వినకుండా, వాహనాన్ని ముందుకు తీసుకెళ్లాలని శరత్‌ ఒత్తిడి చేశాడు.

దీంతో విగ్రహానికి విద్యుత్తు తీగలు తగిలి ట్రాలీకి కరెంట్ సరఫరా అయింది. కిందకు దిగేందుకు యత్నించిన డ్రైవర్‌ భానుప్రసాద్‌ విద్యుదాఘాతానికి గురై 60% గాయపడ్డాడు. సికింద్రాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి సోదరుడు తరుణ్‌ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement