Advertisement

హైదరాబాద్: రాంనగర్ గణేశ్ ఆగమన్‌లో విషాదం

హైదరాబాద్: రాంనగర్‌ వినాయకుని ఆగమన ఊరేగింపులో తీవ్ర విషాదం నెలకుంది. శనివారం రాత్రి VST నుంచి రాంనగర్‌ చౌరస్తా వరకు భారీ డీజే శబ్దాల నడుమ యువకులు ఉత్సాహంగా డాన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో బద్రినాథ్ అనే యువకుడు ఒక్కసారిగా స్పృహతప్పి కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే ట్రాఫిక్‌ పోలీసులకు సమాచారం అందించారు. వారు అంబులెన్స్‌ ద్వారా అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, అదే ఊరేగింపు సమయంలో విద్యుత్‌ షాక్‌కు గురై మరొక వ్యక్తి కూడా కిందపడిపోయినట్లు సమాచారం అందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement