మన పత్రిక: 22వ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET 2026) ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) తిరిగి ప్రారంభించింది. గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులకు మరో అవకాశం కల్పిస్తూ ఆన్లైన్ పోర్టల్‌ను తెరిచింది. ఈ రిజిస్ట్రేషన్ విండో ఆగస్టు 25న ప్రారంభం కాగా, అభ్యర్థులు సెప్టెంబర్ 1, 2026 వరకు అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చని బోర్డు తెలిపింది.
దరఖాస్తు గడువు పెంపు వెనుక కారణాలు
పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) తప్పనిసరి అని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో సీబీఎస్ఈ ఈ నిర్ణయం తీసుకుంది. అర్హులైన ఉపాధ్యాయులందరికీ తగినంత సమయం కల్పించి, ఈ చట్టబద్ధమైన నిబంధనను వారు పూర్తి చేసేలా చూడడమే లక్ష్యంగా అప్లికేషన్ పోర్టల్‌ను పునఃప్రారంభించినట్లు వెల్లడించింది. అంతకుముందు 22వ సీటెట్ నోటిఫికేషన్ మే 8న విడుదల కాగా, మే 11 నుంచి జూన్ 10 వరకు దరఖాస్తులను స్వీకరించారు.
సవరించిన పరీక్ష తేదీలు
ఈ పరీక్షను మొదట సెప్టెంబర్‌లో నిర్వహించాలని భావించినప్పటికీ, దరఖాస్తు ప్రక్రియ తిరిగి ప్రారంభం కావడంతో పరీక్ష తేదీ మారనుంది. సెప్టెంబర్ 1న రిజిస్ట్రేషన్లు ముగిసిన తర్వాత సవరించిన కొత్త పరీక్ష తేదీని (Revised Exam Date) సీబీఎస్ఈ అధికారికంగా ప్రకటించనుంది. సీబీఎస్ఈ ఇప్పటివరకు 21 విడతల్లో సీటెట్ పరీక్షలను నిర్వహించగా, 21వ ఎడిషన్ ఫలితాలు ఈ ఏడాది మార్చి 30న విడుదలయ్యాయి.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
