మన పత్రిక: ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని రేపటి నుంచి డోర్ టు డోర్ ప్రచారం చేపట్టాలని TDP నిర్ణయించింది. ఈ కార్యక్రమం మొత్తం 45 రోజుల పాటు కొనసాగనుంది. ఈ సందర్భంగా పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పార్టీ శ్రేణులకు పలు కీలక సూచనలు చేశారు.
ఈ ప్రచారంలో భాగంగా ప్రభుత్వం సాధించిన విజయాలను, ఇచ్చిన హామీల అమలు తీరును ప్రజలకు సమగ్రంగా వివరించాలని నాయకులను చంద్రబాబు ఆదేశించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలవడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. పార్టీ శ్రేణులు కేవలం అనుచరులుగా మిగిలిపోకుండా నాయకులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రతిపక్ష గొడ్డలి పార్టీకి చెందిన విధ్వంసకర విధానాలను ప్రజల్లో ఎండగట్టాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

Rajendar Degavath has three years of experience in content writing across education, employment, politics, technology, entertainment, and current affairs. He focuses on creating reliable, reader-friendly stories that explain important topics in simple language.
ఇవి కూడా చదవండి :
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ప్రహ్లాద్ జోషి
- వైఎస్ షర్మిల త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన మంత్రి నారా లోకేశ్
- హాస్పిటల్ బెడ్‌పై వైఎస్ షర్మిల సర్జరీ జరిగినట్లు వెల్లడించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్
- తెలంగాణలో రెండవ త్రైమాసికంలో తగ్గిన ద్వేషపూరిత నేరాలు
