Advertisement

శ్రీకాకుళం జిల్లా జైల్లో సీదిరి అప్పలరాజుతో వైఎస్సార్‌సీపీ నేతల ములాఖత్

మన పత్రిక, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా జైల్లో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి Sidiri Appalaraju ను వైఎస్సార్‌సీపీ నేతలు ధర్మాన కృష్ణదాస్, బూడి ముత్యాలనాయుడు, మాజీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబుతో పాటు పలువురు పార్టీ నాయకులు గురువారం ములాఖాత్‌లో కలిశారు. ఈ సందర్భంగా అప్పలరాజుకు వైఎస్సార్‌సీపీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని నేతలు భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం, పోలీసుల తీరుపై విమర్శలు గుప్పించారు.

పోలీసులు రోడ్లపై భారీగా మోహరించి వైఎస్సార్‌సీపీ నాయకులను అడ్డుకుంటున్నారని మాజీ ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు మండిపడ్డారు. సాధారణంగా జరిగే ప్రమాదాలను ఉద్దేశపూర్వక నేరాలుగా చిత్రీకరిస్తూ సీదిరి కుటుంబాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఒక రోడ్డు ప్రమాద కేసులో బీఎన్‌ఎస్ సెక్షన్ 105 వర్తింపజేయడం చట్టవిరుద్ధమని కుంభా రవిబాబు పేర్కొన్నారు. వ్యవస్థలను చేతుల్లోకి తీసుకుని భయపెట్టాలని చూస్తున్నారని, ప్రభుత్వాలు ఎప్పటికీ శాశ్వతం కావనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement