Advertisement

తిరుమలలో నో హారన్ నిబంధన అతిక్రమిస్తే కేసులు మరియు జరిమానాలు

మన పత్రిక, తిరుమల: తిరుమల కొండపై శబ్ద కాలుష్యాన్ని అరికట్టేందుకు గాను టీటీడీ మరియు పోలీసులు నిబంధనలను కఠినతరం చేశారు. కొండపై ‘నో హారన్’ జోన్ నిబంధన అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. వాహనాలు నడిపే భక్తులు మరియు డ్రైవర్లు ఈ రూల్ పాటించకపోతే కేసులతో పాటు జరిమానా ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.

ఈ నిబంధనల అమలులో భాగంగా గడిచిన 6 నెలల కాలంలో రూల్స్ ఉల్లంఘించిన 42 వాహనాలపై పోలీసులు కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. తిరుమలలోని రహదారులపై వాహనాల రాకపోకలను గమనించేందుకు 2000కు పైగా సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. కొండపై ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు భక్తులు మరియు వాహనదారులు అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement