మన పత్రిక: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో PVL Narasimha Raju వైసీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గ పార్టీ బాధ్యతల నుంచి తప్పించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన, ఈ విషయంలో తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉందని సమాచారం.
ఉండి నియోజకవర్గ సమన్వయకర్తగా మంతెన యోగేంద్ర కుమార్‌ను వైసీపీ అధిష్ఠానం నియమించింది. అదే సమయంలో పీవీఎల్ నరసింహరాజును పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా నియమించింది. నియోజకవర్గంలో సుదీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న తమ నాయకుడిని ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి తప్పించడంపై నరసింహరాజు వర్గీయులు, స్థానిక నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కష్టపడిన నాయకుడిని పక్కనబెట్టడం సరైన నిర్ణయం కాదని భావిస్తున్న పీవీఎల్, వైసీపీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
ఇవి కూడా చదవండి :
- నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసిన అర్జున్ దాస్ క్రైమ్ కామెడీ సినిమా ‘కాన్ సిటీ’
- టీవీవీపీ నియామకాలలో వివక్ష చూపుతున్నారని వైద్యుల ఆందోళన
- విద్యార్థుల నిరసనలపై దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించినట్లు వచ్చిన వార్తలను ఖండించిన సీజేఐ
- తిరుమలలో నో హారన్ నిబంధన అతిక్రమిస్తే కేసులు మరియు జరిమానాలు
- పసిడి ప్రియులకు ఊరటగా తగ్గిన బంగారం మరియు వెండి ధరలు
