Advertisement

భిక్కనూరు టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం: యువకుడు దుర్మరణం

మన పత్రిక, భిక్కనూరు: కామారెడ్డి జిల్లా Bikkanuru Toll Plaza సమీపంలో 44వ జాతీయ రహదారిపై గురువారం రాత్రి ద్విచక్ర వాహనం అదుపుతప్పి జరిగిన ప్రమాదంలో ఒక యువకుడు దుర్మరణం పాలయ్యాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా ధర్పల్లికి చెందిన సభావత్ శివ (31) అనే యువకుడు ద్విచక్ర వాహనంపై హైదరాబాద్‌కు బయలుదేరాడు. టోల్ ప్లాజా దాటిన తర్వాత వాహనం ప్రమాదవశాత్తు అదుపుతప్పడంతో కిందపడి మరణించాడు. మృతుడు హైదరాబాద్‌లోని ఒక మెడికల్ ఏజెన్సీలో పనిచేస్తున్నట్లు తేలింది. సమాచారం అందుకున్న భిక్కనూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.

Advertisement
Advertisement