Advertisement

అమరావతిని క్వాంటం హబ్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు కీలక చర్చలు

మన పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాజధాని Amaravati క్వాంటం పరిశోధనలకు ఎంతో అనుకూలమైన ప్రాంతమని, దానిని ప్రధాన క్వాంటం హబ్‌గా అభివృద్ధి చేయడానికి చర్యలు వేగవంతం చేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో క్వాంటినమ్ సంస్థ సీఈఓతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో అమరావతిని క్వాంటం పరిశోధనల కేంద్రంగా మార్చడంపై కీలక చర్చలు నిర్వహించారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ కేంద్రాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు క్వాంటినమ్ సంస్థ ఆసక్తి చూపించింది. అంతేకాకుండా క్వాంటం పరికరాల ఉత్పత్తి ప్రక్రియలో పూర్తి సహకారం అందిస్తామని సదరు సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు.

Advertisement
Advertisement