Advertisement

ముచ్చినిపర్తిలో 6 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

మన పత్రిక, చిట్యాల: మండల పరిధిలోని ముచ్చినిపర్తి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 6 క్వింటాళ్ల ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS Rice) బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశాల మేరకు జిల్లా సీసీఎస్ పోలీసులు పక్కా సమాచారంతో ఈ దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గ్రామానికి చెందిన గౌరీశెట్టి సత్యనారాయణ వద్ద ఉన్న పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు.

స్వాధీనం చేసుకున్న బియ్యంతో పాటు సదరు వ్యక్తిని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం చిట్యాల పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. పేదల కోసం ప్రభుత్వం ఇచ్చే పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసినా, రవాణా చేసినా లేదా విక్రయించినా కఠిన చర్యలు తప్పవని జిల్లా పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి అక్రమాలపై సమాచారం ఇచ్చి పోలీసులకు సహకరించాలని ప్రజలను కోరారు.

Advertisement
Advertisement