మన పత్రిక: మాజీ మంత్రి, వైకాపా నేత సీదిరి అప్పలరాజు అరెస్ట్ పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వ రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగమేనని వైకాపా మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కల్యాణి ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ప్రశ్నిస్తున్నారనే కారణంతోనే ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆమె విమర్శించారు. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసులో కుమారుడు ఉంటే, తండ్రిని అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు.
ఈ ప్రమాదాన్ని మొదట హత్య కేసుగా నమోదు చేయడాన్ని కోర్టు కూడా తప్పుపట్టడంతో మళ్లీ సెక్షన్లు మార్చారని, ఇది ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తోందని కల్యాణి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీసీ నాయకులను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని, జోగి రమేశ్, కారుమూరి నాగేశ్వరరావు, రమేశ్ యాదవ్, సీదిరి అప్పలరాజు వంటి బీసీ నేతల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. గుంటూరులో మహిళపై జరిగిన ఘటన, సినీనటి జత్వానీ కేసుల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఈ అరెస్టులు చేస్తున్నారని, విశాఖలో ఆరుగురు మత్స్యకారుల గల్లంతుపై సీదిరి అప్పలరాజు నిలదీశారనే ఆయనపై కక్ష కట్టారని తెలిపారు.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
ఇవి కూడా చదవండి :
- అమరావతిని క్వాంటం హబ్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు కీలక చర్చలు
- హనీమూన్ హత్య కేసులో భార్య బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు
- అమరావతిలో పీఎన్బీ క్వాంటం హబ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం
- తెనాలిలో డ్రైవింగ్ టెస్టు సందర్భంగా కారు ప్రమాదం: నలుగురికి గాయాలు
- తిరుమల అలిపిరి మార్గంలో సినిమా ఫ్లెక్సీ ప్రదర్శన పై భక్తుల ఆగ్రహం
