మన పత్రిక: నీట్ (NEET) పేపర్ లీక్ వివాదంపై జంతర్ మంతర్ వద్ద సిజేపీ (CJP) నిర్వహించిన ‘సంసద్ చలో’ నిరసనలు హింసాత్మకంగా మారడంపై Delhi Police తీవ్రస్థాయిలో స్పందించారు. విధులు నిర్వర్తిస్తున్న తమ సిబ్బందిపై జరిగిన దాడులను ఖండిస్తూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక భావోద్వేగ పోస్ట్ చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉన్నప్పటికీ హింసకు తావులేదని స్పష్టం చేశారు. యూనిఫామ్ వెనుక కూడా స్పందించే హృదయం, కుటుంబం, దేశానికి సేవ చేస్తామన్న ప్రమాణం ఉంటాయని, అధికారులపై దాడులు చేయడం తీవ్రంగా కలచివేస్తోందని తెలిపారు.
ఈ నిరసనల సందర్భంగా అల్లరి మూకలు రాళ్లదాడికి దిగడమే కాకుండా పోలీస్ వాహనాలను ధ్వంసం చేశాయని తెలిపారు. రాళ్లదాడిలో ఏసీపీ జైప్రకాష్, ఏసీపీ వివేక్ భగత్లతో పాటు దాదాపు 118 మంది పోలీస్ సిబ్బంది గాయపడ్డారని, వారిలో కొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఈ ఘటనపై న్యూఢిల్లీ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 10 ఎఫ్ఐఆర్లు (FIRs) నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. శాంతిభద్రతలను పరిరక్షించడమే తమ ప్రాధాన్యమని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
