Advertisement

నా ఆస్తులన్నీ పోయాయనడం అవాస్తవం: సినీ నిర్మాత బండ్ల గణేశ్ స్పష్టత

మన పత్రిక: తన ఆస్తులన్నీ పోయాయంటూ వస్తున్న వార్తలపై సినీ నిర్మాత బండ్ల గణేశ్ స్పందించారు. తన ఆస్తులన్నీ పోయాయనడం పూర్తిగా అవాస్తవమని, ఈ వ్యవహారం కేవలం ఒక్క ప్రాపర్టీకి సంబంధించిన కేసు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లోని షేక్‌పేటలో ఉన్న 500 గజాల ఆస్తికి మాత్రమే ఈ కేసు పరిమితమై ఉందని Bandla Ganesh వెల్లడించారు. ఈ ఆస్తిని 2022లో యూనియన్ బ్యాంక్ రూ.8.51 కోట్లకు విక్రయించిందని తెలిపారు. ఈ విషయమై తాను దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు కూడా కొట్టివేసిందని, అత్యున్నత నాయస్థానమైన సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పును తాను శిరసావహిస్తానని ఆయన పేర్కొన్నారు.

Advertisement
Advertisement