Advertisement

వైసీపీ నేత జక్కంపూడి రాజాపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు

మన పత్రిక, కర్నూలు: వైసీపీ నేత Jakkampudi Raja పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. కర్నూలులో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో స్థానిక సీఐ శేషయ్యపై ఆరోపణలు చేశారనే ఫిర్యాదుతో త్రీటౌన్ పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. విచారణకు హాజరుకావాలని కోరుతూ ఆయనకు నోటీసులు కూడా అందజేశారు.

గతంలో సీఐ శేషయ్య ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైసీపీ టికెట్ కోసం తమ వద్దకు వచ్చారని జక్కంపూడి రాజా ధర్నాలో వ్యాఖ్యానించారు. కోట్ల రూపాయల సొమ్ముతో పోటీకి ప్రయత్నించగా, అవినీతిపరులకు టికెట్లు ఇచ్చేది లేదని తిరస్కరించినట్లు చెప్పారు. అలాగే వైసీపీ కార్యకర్త బాలుని సీఐ వేధించారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై సీఐ శేషయ్య ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించగా, పరిశీలించిన కమిషన్ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కమిషన్ సూచనల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు.

Advertisement
Advertisement