Advertisement

నీతి ఆయోగ్ కొత్త సీఈఓగా అనురాగ్ జైన్ నియామకం

మన పత్రిక: కేంద్ర ప్రభుత్వం అత్యున్నత విధాన రూపకల్పన సంస్థ అయిన నీతి ఆయోగ్ (NITI Aayog) కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా సీనియర్ ఐఏఎస్ అధికారి అనురాగ్ జైన్‌ను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నియామకానికి సంబంధించి ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ అధికారికంగా ఆమోదం తెలిపింది.

మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అనురాగ్ జైన్ రెండేళ్ల పాటు ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఈ నియామకానికి సంబంధించి డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కార్యదర్శి మనీషా సక్సేనా అధికారిక ఉత్తర్వులను జారీ చేశారు.

Advertisement
Advertisement