Advertisement

తల్లికి వందనం పథకం ద్వారా పదివేల కోట్ల నిధుల విడుదల

మన పత్రిక: తల్లికి వందనం పథకం కింద రెండో ఏడాది నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకం ద్వారా 67.47 లక్షల మంది విద్యార్థులకు రూ.10,120 కోట్లు జమ చేశామని కాలవ శ్రీనివాసులు వెల్లడించారు. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఈ పథకం వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనార్టీ వర్గాల వారికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని ఆయన వివరించారు.

అమ్మఒడి పథకంపై విమర్శలు

గతంలో అమలు చేసిన అమ్మఒడి పథకం ద్వారా జగన్ 25 లక్షల మంది విద్యార్థులను మోసం చేశారని కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. అమ్మఒడితో జగన్ వెన్నుపోటు పొడిచారని, ఇప్పుడు అమలవుతున్న తల్లికి వందనం పథకం విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement