Advertisement

సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్షను విరమించాలని సీజేపీ కోరిక

మన పత్రిక: ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త Sonam Wangchuk తన దీక్షను తక్షణమే విరమించాలని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కోరింది. పోలీసులు ఆయనను ఆస్పత్రికి తరలించినప్పటికీ, వాంగ్‌చుక్ తన దీక్షను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందుతూ సీజేపీ ఒక ప్రత్యేక లేఖను పంపింది. విద్యార్థుల కోసం, దేశ భవిష్యత్తు కోసం ఆయన చేస్తున్న త్యాగం యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని పార్టీ పేర్కొంది.

వాంగ్‌చుక్ ప్రాణాలు దేశానికి చాలా విలువైనవని, ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నిరాహార దీక్షను ఆపాలని సీజేపీ విజ్ఞప్తి చేసింది. మీరు దీక్ష విరమించినంత మాత్రాన పోరాటం ఆగిపోదని, విద్యార్థుల హక్కులు మరియు న్యాయం కోసం తాము ఉద్యమాన్ని చివరి వరకు కొనసాగిస్తామని పార్టీ ప్రతినిధులు స్పష్టం చేశారు.

Advertisement
Advertisement