Advertisement

తిరుమల భక్తులకు ముఖ్య గమనిక, సర్వదర్శనం టోకెన్లపై టీటీడీ కీలక నిర్ణయం

మన పత్రిక: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సమాచారాన్ని అందించింది. తిరుపతిలో భక్తుల రద్దీ భారీగా పెరగడంతో, సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా వరుసగా నాలుగో వారం కూడా టోకెన్ల జారీ నిలిపివేత కొనసాగుతోంది.

దర్శనం టోకెన్ల రద్దు

గురువారం రోజున జరగాల్సిన దర్శనం కోసం ఇప్పటికే కేటాయించిన టోకెన్లను టీటీడీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, శుక్రవారం దర్శనానికి సంబంధించి టోకెన్ల జారీ గురువారం నుంచి యథావిధిగా ప్రారంభమవుతుందని టీటీడీ స్పష్టం చేసింది. భక్తులు ఈ మార్పులను గమనించి ప్రయాణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని కోరారు.

Advertisement
Advertisement