మన పత్రిక, హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్, డీఎస్పీ మహ్మద్ సిరాజ్ హైదరాబాద్‌లోని డీజీపీ ప్రధాన కార్యాలయంలో సందడి చేశారు. రాష్ట్ర డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో, ఆయనను మర్యాదపూర్వకంగా కలిసేందుకు సిరాజ్ వెళ్లారు. దాదాపు గంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో ఇన్‌స్పెక్టర్ జనరల్ గజారావు భూపాల్, డీఎస్పీ రామారావు కూడా పాల్గొన్నారు.
ఆత్మీయ పలకరింపు
ఖాకీ యూనిఫాంలో హాజరైన మహ్మద్ సిరాజ్, డీజీపీ సీవీ ఆనంద్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తన జెర్సీ నంబర్ 73ని ఆవిష్కరించారు. క్రికెట్‌ను ఎంతో ఇష్టపడే సీవీ ఆనంద్ డీజీపీగా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందని సిరాజ్ పేర్కొన్నారు. ఆయనకు మరిన్ని విజయాలు దక్కాలని ఆకాంక్షిస్తూ, ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. 2024 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినందుకు గుర్తింపుగా, అదే ఏడాది అక్టోబర్‌లో తెలంగాణ ప్రభుత్వం సిరాజ్‌ను డీఎస్పీగా నియమించిన విషయం తెలిసిందే.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
