Advertisement

నారాయణపేట మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లు పెంచాలి: మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి

మన పత్రిక, నారాయణపేట: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రస్తుతం కేవలం 50 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉండటం స్థానిక విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్ రాజేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణలోని ఇతర ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 150 సీట్లు అందుబాటులో ఉండగా, ఇక్కడ మాత్రం తక్కువ సీట్లు ఉండటంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్యకు దూరమవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

నారాయణపేట వెనుకబడిన ప్రాంతం కావడంతో, ఇక్కడి విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యతని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని, ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి త్వరితగతిన సీట్ల సంఖ్యను పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement
Advertisement