Advertisement

13వ స్థానానికి పడిపోయిన తెలంగాణ: ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్

మన పత్రిక: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం నీతి ఆయోగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ ర్యాంకింగ్-2026లో 13వ స్థానానికి పడిపోయిందని బీఆర్ఎస్ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

గత తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం మరియు కేటీఆర్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు, తెలంగాణ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఎప్పుడూ మొదటి మూడు స్థానాల్లోనే ఉందని సంజయ్ గుర్తు చేశారు. నాటి టీఎస్-ఐపాస్ పాలసీని ఇతర రాష్ట్రాలు సైతం అనుసరించాయని, అటువంటి సమర్థవంతమైన విధానం ఉన్నప్పటికీ ప్రస్తుతం రాష్ట్రం వెనుకబడిందని ఆయన విమర్శించారు. రేవంత్ రెడ్డి పాలన కారణంగానే పెట్టుబడిదారులు వెనకడుగు వేస్తున్నారని, కొత్త పరిశ్రమలు రావడం లేదని ఆయన ఆరోపించారు.

Advertisement
Advertisement