మన పత్రిక, ముంబై: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక గ్రాండ్ ఫ్యాషన్ షోలో బాలీవుడ్ నటి అనన్య పాండేకు చేదు అనుభవం ఎదురైంది. ఈ షోలో షోస్టాపర్‌గా పాల్గొన్న అనన్య, ర్యాంప్ వాక్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంది. అయితే, కార్యక్రమం ముగిసిన తర్వాత మీడియాకు ఫోటోలు ఇస్తున్న సమయంలో గౌరవ్ గుప్తా ఆమెతో అతిగా చనువు ప్రదర్శించారు.
ఫోటోలకు ఫోజులు ఇస్తున్న క్రమంలో డిజైనర్ గౌరవ్ గుప్తా అనన్య నడుముపై చేయి వేసి గిల్లడంతో ఆమె తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. వందల మంది చూస్తున్న బహిరంగ వేదికపై కెమెరాల మధ్య ఈ ఘటన జరగడంతో అనన్య ఇబ్బందిపడినప్పటికీ, చాలా హుందాగా వ్యవహరించారు. ఏమాత్రం సహనం కోల్పోకుండా, నవ్వుతూనే ఆ పరిస్థితి నుండి బయటపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నెటిజన్లు డిజైనర్ ప్రవర్తనను తప్పుబడుతూ ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
ఇవి కూడా చదవండి :
- మైసూరులో గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం: ముగ్గురు నిందితుల అరెస్టు
- హారర్ సినిమా తీసే ఆలోచనలో ఉన్న క్రిస్టోఫర్ నోలన్
- సిక్కిం జలవిద్యుత్ ప్రాజెక్టు టన్నెల్ ప్రమాదం: మరణించిన వారి సంఖ్య 10కి చేరిక
- సినిమా షూటింగ్ సమయంలో గాయపడిన నందమూరి బాలకృష్ణ
- తెలంగాణ హైకోర్టు వద్ద నిలిచిపోయిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
