Advertisement

రేవంత్ పాలనలో ఐటీ రంగం కుంటుపడుతోంది: దాసోజు శ్రవణ్

మన పత్రిక: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో హైదరాబాద్ ఐటీ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని బీజేపీ నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు. రాష్ట్రంలో ఐటీ పరిశ్రమను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. కాగ్నిజెంట్ సంస్థ తన కార్యకలాపాలను విశాఖపట్నానికి తరలిస్తోందని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఇప్పటికే సుమారు లక్షా 20 వేల ఉద్యోగాలు కోల్పోయారని దాసోజు శ్రవణ్ వెల్లడించారు. అసెంబ్లీ వేదికగా 7 వేల ఉద్యోగాలు తగ్గినట్లు అధికారికంగానే గణాంకాలు బయటపడ్డాయని ఆయన గుర్తుచేశారు. ఐటీ రంగం పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement