మన పత్రిక: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి తాజాగా కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ ట్రస్టులు మరియు వివిధ పథకాలకు విరాళాలు అందించే దాతల ప్రివిలేజెస్‌లో మార్పులు చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిబంధనలు నేటి అర్ధరాత్రి నుండి అమలులోకి రానున్నాయి.
అభివృద్ధి మరియు సంక్షేమ పనులు
సామాన్య భక్తుల సౌకర్యార్థం తిరుమలలో రూ. 6.31 కోట్ల వ్యయంతో శాశ్వత షెడ్లను నిర్మించాలని పాలకమండలి నిర్ణయించింది. అలాగే, ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయ పరిధిలో 100 గదుల నిర్మాణానికి అవసరమైన టెండర్లను బోర్డు ఆమోదించింది.
నియామకాలు మరియు ఇతర నిర్ణయాలు
వేద పారాయణ స్కీం కింద 791 మంది వేద పండితులను కొత్తగా నియమించాలని టీటీడీ నిర్ణయించింది. దీనితో పాటు, ఎస్వీ మ్యూజియం ప్రవేశ రుసుమును రూ. 50గా ఖరారు చేస్తూ, మ్యూజియం నిర్వహణ బాధ్యతలపై టాటా సంస్థతో చర్చలు జరపాలని బోర్డు నిర్ణయించింది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
