Advertisement

హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడి: ఇరాన్‌కు భారత్ తీవ్ర

మన పత్రిక: హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య చమురు ట్యాంకర్లపై జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనలో ఒక భారతీయ నావికుడు మృతి చెందగా, మరో ఆరుగురు భారతీయులు గాయపడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇరాన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేసింది.

విదేశాంగ మంత్రిత్వ శాఖ ఢిల్లీలోని ఇరాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ మొహమ్మద్ జవాద్ హొస్సేనీని పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలు, నావికులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని భారత్ స్పష్టం చేసింది.

Advertisement

నౌకల్లో 30 మంది భారతీయులు

దాడికి గురైన ఎంటీ అల్ బహియాహ్, ఎంటీ మొంబాసా ట్యాంకర్లలో మొత్తం 46 మంది సిబ్బంది ఉండగా, వారిలో 30 మంది భారతీయులు ఉన్నారని విదేశాంగ శాఖ పేర్కొంది. ఎంటీ అల్ బహియాహ్‌లో ఉన్న 12 మంది భారతీయుల్లో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. అంతర్జాతీయ జలమార్గాల్లో స్వేచ్ఛాయుత, సురక్షిత నౌకాయానాన్ని అడ్డుకునే దాడులు అంగీకారయోగ్యం కావని భారత్ స్పష్టం చేసింది.

ప్రాంతీయ ఉద్రిక్తతలు

పశ్చిమాసియాలో హింసకు ముగింపు పలికి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని భారత్ పిలుపునిచ్చింది. హోర్ముజ్ జలసంధిలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల ప్రపంచ సముద్ర వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పటివరకు ఈ ఘర్షణల్లో 11 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారని అధికారిక సమాచారం.

Advertisement