Advertisement

షాబాద్‌ ఆరుగురి హత్య కేసు: పరారీలో నిందితుడు రాజ్‌కుమార్

మన పత్రిక, షాబాద్: రంగారెడ్డి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని హత్య చేసిన నిందితుడు రాజ్‌కుమార్ ఆచూకీ కోసం సైబరాబాద్ పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఘోరకలి జరిగి 48 గంటలు గడుస్తున్నా నిందితుడు పోలీసులకు చిక్కలేదు. దర్యాప్తులో భాగంగా నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఏకంగా 16 సిమ్ కార్డులను ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. నిందితుడు తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సీసీటీవీ (CCTV) దృశ్యాల్లో నమోదైంది. అయితే చివరి నిమిషంలో భయపడి పక్కకు తప్పుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.

హత్యల అనంతరం రాజ్‌కుమార్ అద్దె కారులో తిమ్మాపూర్ చేరుకుని, కారును వదిలేసి పరారయ్యాడు. నిందితుడు బెంగళూరు లేదా శ్రీశైలం వైపు పారిపోయి ఉంటారని ప్రత్యేక బృందాలు (SOT) అనుమానిస్తున్నాయి.

Advertisement
Advertisement