Advertisement

ఢిల్లీ యమునా నదిలో నలుగురు బాలురు గల్లంతు.. ఇద్దరి మృతదేహాలు లభ్యం

మన పత్రిక, ఢిల్లీ: దేశ రాజధానిలోని అలీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల హీరాంకి గ్రామం వద్ద యమునా నదిలో నలుగురు మైనర్ బాలురు గల్లంతయ్యారు. ఆదివారం సాయంత్రం సరదాగా స్నానానికి నదిలోకి దిగిన వీరు, ప్రవాహ తీవ్రతకు కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయి. రాత్రి వరకు కొనసాగిన శోధనలో ఇద్దరు బాలుర మృతదేహాలను వెలికితీశారు. చీకటి పడటంతో రెస్క్యూ ఆపరేషన్ తాత్కాలికంగా నిలిపివేసి, సోమవారం ఉదయం తిరిగి ప్రారంభించారు.

నదిలో నీటి ప్రవాహం బలంగా ఉండటంతో మిగిలిన ఇద్దరు బాలుర కోసం చేపట్టిన గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోంది. సోమవారం నాటి గాలింపులో ఇప్పటివరకు ఎవరూ లభించలేదు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.

Advertisement
Advertisement