Advertisement

ప్రముఖ గాయని ఎస్. జానకి మృతి పట్ల మంత్రి నారా లోకేశ్ సంతాపం

మన పత్రిక, అమరావతి: ప్రముఖ గాయని ఎస్. జానకి (S. Janaki) మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తీవ్ర సంతాపం ప్రకటించారు. తెలుగు గడ్డపై జన్మించిన ఆమె దక్షిణ భారత గానకోకిలగా ఎనలేని కీర్తిని సంపాదించుకున్నారని ఆయన కొనియాడారు. సంగీత ప్రపంచంలో తనదైన శైలిలో ఆమె సుమారు 48 వేలకు పైగా పాటలు పాడి, కోట్లాది మంది సంగీత ప్రియుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని గుర్తు చేశారు.

ఆమె మరణం మొత్తం సినీ పరిశ్రమకు తీరని లోటు అని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. తన గాత్రంతో ఎన్నో దశాబ్దాల పాటు అలరించిన ఆమె సేవలు చిరస్మరణీయమని ఆయన అన్నారు. ఈ కష్టకాలంలో జానకి గారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు.

Advertisement
Advertisement