మన పత్రిక, ఢిల్లీ: ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ భారత మార్కెట్లోకి విడా (VIDA) బ్రాండ్ ద్వారా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పరిచయం చేసింది. ఈ సరికొత్త VIDA VX2 ప్లస్ మోడల్ 4.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తోంది. కంపెనీ గణాంకాల ప్రకారం, ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే ఈ స్కూటర్ 187 కిలోమీటర్ల గరిష్ట రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్‌లో రెండు రిమూవబుల్ బ్యాటరీలు అమర్చారు.
డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం ద్వారా కేవలం 65 నిమిషాల్లో 80 శాతం ఛార్జింగ్ పూర్తి చేసుకోవచ్చు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1,43,990గా నిర్ణయించారు. ఈ స్కూటర్ ఈ నెల చివరి నాటికి దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌లలో అందుబాటులోకి రానుంది. ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ (Asia Book of Records) లో కూడా ఈ మోడల్ చోటు దక్కించుకుంది.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
