Advertisement

ఏపీ విపత్తు నిర్వహణ సంస్థలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టుల భర్తీ

మన పత్రిక, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) కాంట్రాక్టు ప్రాతిపదికన సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టును భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి నెలకు రూ.61,500 వేతనం లభిస్తుంది. అభ్యర్థులు కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో బీటెక్ పూర్తి చేసి ఉండాలి. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా కనీసం ఐదేళ్ల పని అనుభవం తప్పనిసరి. అభ్యర్థుల వయస్సు 45 ఏళ్ల లోపు ఉండాలి. దరఖాస్తులను స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపాలి. దరఖాస్తులు సమర్పించడానికి జూలై 20, 2026 సాయంత్రం 5:00 గంటల వరకు గడువు ఉంది. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ తేదీ, సమయాన్ని తెలియజేస్తారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను చూడవచ్చు.

Advertisement