మన పత్రిక, తుంగతుర్తి: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నాగారం మండలం ఈటూరు గ్రామంలో ఆదివారం విషాద సంఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్ పై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈటూరు గ్రామానికి చెందిన బొబ్బిలి లింగస్వామి (33) గ్రామం నుంచి ఎస్సారెస్పీ కాల్వ వద్దకు ట్రాక్టర్‌పై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పైనుంచి కిందపడటంతో లింగస్వామి తలకు బలమైన గాయమైంది. దీంతో అతడిని వెంటనే చికిత్స నిమిత్తం సూర్యాపేటలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి తీసుకువెళ్తుండగానే మార్గమధ్యలో అతడు ప్రాణాలు విడిచాడు.
మృతుడు లింగస్వామికి భార్య ఉషతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనపై మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నాగారం ఎస్ఐ చిరంజీవి వివరించారు.
ఇవి కూడా చదవండి :
- NEET UG 2026 : నీట్ యూజీ రీ-ఎగ్జామినేషన్‌కి భారీ భద్రత!
- Peddi : వీకెండ్ బ్లాస్ట్ పెద్ది @250కోట్లు… ఇక మీదుంటది అసలు సవాల్!
- School Summer Holidays : స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు..
- కోహెడలో రూ.2,300 కోట్లతో పండ్ల మార్కెట్‌కు సీఎం శంకుస్థాపన
- Peddi : అడ్వాన్స్ బుకింగ్స్ లో పెద్ది జోరు… సెంచరీ ఖాయం…
