మన పత్రిక, మదనపల్లె: వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణానికి చెందిన మయూరి రఘునాథ్ రెడ్డి నియమితులయ్యారు. తనకు పార్టీలో సముచిత స్థానం కల్పించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తన నియామకానికి సహకరించిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తనకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తానని రఘునాథ్ రెడ్డి స్పష్టం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, 2029 శాసనసభ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలన్నదే తన దృఢ సంకల్పమని ఆయన ఉద్ఘాటించారు. కొత్త బాధ్యతలు చేపట్టిన మయూరి రఘునాథ్ రెడ్డికి స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలిపారు.
ఇవి కూడా చదవండి :
- Miryalaguda : మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్గా నర్రా శ్రీజా రెడ్డి
- Telangana Welfare Schemes: తెలంగాణలో ఒకే కార్డుతో అన్ని సంక్షేమ పథకాలు
- బీఎస్ఎన్ఎల్లో 100 జేటీఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
- హైదరాబాద్లో పడిపోయిన రియల్ ఎస్టేట్: కొనుగోలుదారులు లేక ఖాళీగా ఫ్లాట్లు
- Petrol Diesel price hike : మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: దిల్లీలో రూ. 100 దాటిన రేటు
