Advertisement

బండ్లగూడలో తప్పిపోయిన నాలుగేళ్ల చిన్నారి గుర్తింపు..

మన పత్రిక, హైదరాబాద్: అదృశ్యమైన నాలుగేళ్ల చిన్నారిని బండ్లగూడ పోలీసులు వేగంగా స్పందించి కేవలం రెండు గంటల్లోనే సురక్షితంగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ఘౌస్‌నగర్ ప్రాంతానికి చెందిన ఈ చిన్నారి బుధవారం మధ్యాహ్నం కనిపించకుండా పోయింది. దీనితో ఆందోళనకు గురైన పాప తల్లి మధ్యాహ్నం 2 గంటల సమయంలో బండ్లగూడ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే అధికారులు అప్రమత్తమై ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ప్రారంభించారు. పరిసర ప్రాంతాల్లో విచారణ చేపట్టడంతో పాటు సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు. దర్యాప్తులో లభించిన కీలక ఆధారాల ద్వారా సమీపంలోని ఒక రెసిడెన్షియల్ కాలనీలో చిన్నారిని మధ్యాహ్నం 3.20 గంటల సమయంలో సురక్షితంగా గుర్తించారు.

Advertisement

అనంతరం పాపను కుటుంబ సభ్యులకు చేర్చారు. పిల్లల భద్రత పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని, చిన్నారులపై నిరంతరం నిఘా ఉంచాలని, అపరిచిత ప్రాంతాల్లో ఒంటరిగా వదిలేయొద్దని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.

Advertisement