Advertisement

గురుకులాలు, హాస్టళ్లకు గుడ్‌న్యూస్.. ఇకపై ప్రతి నెలా డైట్ ఛార్జీలు

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ గురుకులాలు, హాస్టళ్ల ఆర్థిక ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభిస్తూ నెలవారీ చెల్లింపుల విధానం అమల్లోకి వచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమం, విద్యా శాఖల పరిధిలోని నివాస విద్యాసంస్థల డైట్ ఛార్జీలు, కాస్మెటిక్స్ ఖర్చులు, భవన అద్దెలను ఇకపై ప్రతి నెలా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రూ. 221.24 కోట్ల నిధులను తక్షణమే మంజూరు చేసింది.

గతంలో నిధుల చెల్లింపుల్లో 8 నుంచి 9 నెలల ఆలస్యం జరగడం వల్ల విద్యార్థుల భోజన వసతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ సమస్య పరిష్కారానికి ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మొదట త్రైమాసిక విధానాన్ని తెచ్చి, ఇప్పుడు దానిని నెలవారీ చెల్లింపులుగా మార్చారు. 2026-27 వార్షిక బడ్జెట్ సందర్భంగా అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు ఈ నిధులను విడుదల చేశారు. అణగారిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన నివాస సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Advertisement
Advertisement