Advertisement

నీట్ 2026 పేపర్ లీక్: 16 మందిని అరెస్ట్ చేసిన సీబీఐ

మన పత్రిక, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ (NEET) 2026 పేపర్ లీక్ కేసులో సీబీఐ, రాజస్థాన్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వివిధ రాష్ట్రాల్లో ఇప్పటివరకు మొత్తం 16 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మహారాష్ట్ర, హర్యానా, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులతో అంతర్రాష్ట్ర నెట్‌వర్క్ ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.

మహారాష్ట్రలో ఇద్దరిని అరెస్ట్ చేయగా, వారిలో ఒకరు బిఏఎంఎస్ విద్యార్థి అని గుర్తించారు. నిందితులు గుండు చేయించుకోవడం వంటి మార్పులతో తమ గుర్తింపును మార్చుకునేందుకు ప్రయత్నించారు. సీబీఐ అందించిన సాంకేతిక ఆధారాలతో ఫోన్ డేటా, ఫోటోలను సేకరించిన పోలీసులు పుణే, నాసిక్ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. లీక్ అయిన మెటీరియల్‌ను పలు ప్రాంతాల్లో పంపిణీ చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ పరిణామాలతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

Advertisement
Advertisement