Advertisement

ఏపీలో ‘ట్రాన్స్‌జెండర్ వెల్ఫేర్ బోర్డు’ నియామకం

మన పత్రిక, ఆంధ్రప్రదేశ్: సమాజంలో ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ‘ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ స్టేట్ వెల్ఫేర్ బోర్డు’ను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో వారి సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ఈ బోర్డు పనిచేయనుంది.

ట్రాన్స్‌జెండర్ హక్కుల పరిరక్షణ చట్టం-2019 కింద ఏర్పాటు చేసిన ఈ బోర్డులో ఆంధ్ర ప్రాంత ప్రతినిధిగా విశాఖపట్నం కలెక్టర్, రాయలసీమ ప్రతినిధిగా తిరుపతి జిల్లా కలెక్టర్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఈ అధికారులతో పాటు ప్రేమ్ సాగర్ రాయ్, జీవన్ కుమారి, దుర్గలను నామినేటెడ్ సభ్యులుగా ఎంపిక చేస్తూ మహిళా, శిశు, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖ ఆదేశాలిచ్చింది.

Advertisement

తాజాగా నియమితులైన ఈ సభ్యుల పదవీకాలం రెండేళ్ల పాటు ఉంటుంది. ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ట్రాన్స్‌జెండర్లకు నేరుగా చేరవేయడం, సామాజికంగా వారిని గౌరవప్రదమైన స్థితిలోకి తీసుకురావడంపై వీరు ప్రత్యేక దృష్టి సారిస్తారు.

Advertisement