మన పత్రిక, హైదరాబాద్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) ఘనవిజయం సాధించడంతో దళపతి విజయ్ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. రాజకీయాల కోసం ఆయన సినిమాలకు స్వస్తి పలకడంతో దశాబ్దాల కోలీవుడ్ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది.
విజయ్ దూరం కావడంతో ఏటా రూ. 500-1000 కోట్ల బిజినెస్ చేసే భారీ మార్కెట్ ఖాళీ అయ్యింది. ఆయన వదిలిన నంబర్ 1 స్థానం కోసం అజిత్, సూర్య, ధనుష్, శివకార్తికేయన్, విక్రమ్, విజయ్ సేతుపతి, కార్తీల మధ్య పోటీ నెలకొంది. మరోవైపు, చిత్ర పరిశ్రమపై ఉన్న డీఎంకే, రెడ్ జెయింట్ మూవీస్ ఆధిపత్యానికి ముగింపు పలుకుతూ థియేటర్ల కేటాయింపు సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
చిన్న సినిమాలకు సబ్సిడీలు, కార్మికుల సంక్షేమంపై ఆశలు చిగురించాయి. ఎంజీఆర్, జయలలిత తర్వాత సినీ గ్లామర్‌ను పటిష్ట రాజకీయ శక్తిగా మార్చిన విజయ్‌కు చియాన్ విక్రమ్, శివకార్తికేయన్, నాని, నిఖిల్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
